Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతి : ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాల ( New districts ) ఏర్పాటుకు కేబినెట్ ( AP Cabunet ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 25 వరకు ఉన్న జిల్లాల సంఖ్య 28కు చేరుకుంది . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu ) అధ్యక్షతన సోమవారం మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది . కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లా ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్‌ను ఈనెల 31న విడుదల చేయనున్నారు. అదేవిధంగా కొన్ని జిల్లాల పునర్వీభజన చేయనున్నామని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 17 జిల్లాలో ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామన్నారు. చేర్పులు, మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.. అన్నమయ్య జిల్లా కేంద్రం ఇదివరకు రాయచోటి ఉండగా మదనపల్లె జిల్లా కేంద్రంగా ఉంటుందని వివరించారు. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మార్చామని వెల్లడించారు. రాజంపేటను కడప జిల్లాలో, కడపలోకి సిద్ధవటం, ఒంటిమిట్ట, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
Admin
Studio18 News