Tuesday, 30 December 2025 05:09:25 AM
# Vaikunta Ekadasi | వారాసిగూడలో వైకుంఠ ఏకాదశి వెలుగులు.. దేదీప్యమానంగా శ్రీ కల్యాణ వెంకటేశ్వరుడి ఆలయం..! # Tirumala | తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం # Man Harassing Woman | మాల్‌లో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన.. డెలివరీ మ్యాన్‌ అరెస్ట్‌ # Respiratory Diseases | చ‌లికాలంలో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే.. ఇలా చేయాలి.. # Raja Saab | డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయింది # Melbourne Cricket Ground: మెల్‌బోర్న్ పిచ్ అసంతృప్తిక‌రం.. రేటింగ్ ఇచ్చిన ఐసీసీ # KCR | కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల # Pop Corn | పాప్ కార్న్ అస‌లు మ‌న ఆరోగ్యానికి మంచిదేనా..? దీన్ని తింటే ఏం జ‌రుగుతుంది..? # Doug Bracewell | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ దిగ్గజం.. కారణమిదే..! # Acne | అస‌లు మ‌న‌కు మొటిమ‌లు ఎందుకు వ‌స్తాయి..? అవి ఏర్ప‌డ‌డానికి కార‌ణాలు ఏమిటి..? # OTT Movies | న్యూ ఇయర్ & సంక్రాంతి స్పెషల్‌గా సినిమా హంగామా.. థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న మూవీస్ ఇవే! # Cricket | అండర్‌-19 రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు వరంగల్‌కు చెందిన సహస్రరాజ్‌ ఎంపిక # AP Cabinet | ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం # Mexico Train Derailment | మెక్సికోలో పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు # Amelia Kerr | టీ20ల్లో ముంబై స్టార్ విధ్వంసం.. 59 బంతుల్లోనే సెంచరీ..! # Kuldeep Sengar: కుల్దీప్ సెంగర్‌కు మరణశిక్ష పడేవరకు నా పోరాటం ఆగదు: ఉన్నావ్ బాధితురాలు # Qari Yaqoob Sheikh: పాకిస్థాన్ లో కొత్త టెర్రరిస్ట్ లీడర్.. హఫీజ్, మసూద్ పనికిరారని భావిస్తున్న పాక్ ప్రభుత్వం # Hyderabad | మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం # India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మూడో టీ20... విద్యార్థులకు తక్కువ ధరకే టికెట్లు! # 'దండోరా' సినిమా రివ్యూ

'దండోరా' సినిమా రివ్యూ

Date : 29 December 2025 07:21 PM Views : 27

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కులవివక్ష నేపథ్య కథ బలమైన కథ, పాత్రలు నిజాయితీ ప్రయత్నం గ్రామీణ ప్రేమకథలకు తెలుగుతెరపై ఎప్పూడు ఆదరణ ఉంటుంది. సహజత్వంతో తెరకెక్కిన పల్లెకథలు ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఇప్పుడు ఈ కోవలోనే రూపొందిన చిత్రం 'దండోరా'. ట్రైలర్‌తో అందర్ని ఆలోచింపజేసిన ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏమిటి? ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? ఈ గ్రామీణ ప్రేమకథలోని ఎమోషన్స్‌ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకున్నాయా? లేదా అనేది ఈ చిత్ర సమీక్షలో తెలుసుకుందాం. కథ: ఈ మధ్య కాలంలో కులవివక్షపై చాలా ప్రేమకథలు వచ్చాయి. ఆ కోవలోనే కుల వివక్ష నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. కుల వివక్ష విస్తరించుకున్న తెలంగాణలోని ఓ ఊరిలో ఓ పెద్ద కులానికి చెందిన మోతుబరి శివాజీ (శివాజీ) కూడా ఈ వివక్షకు గురవతాడు. సొంత కొడుకు విష్ణు (నందు)తోనూ కొన్ని కారణాల వల్ల మాటలుండవు. ఆయన చనిపోయినా తన కులానికి చెందిన స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు చేయడానికి వీల్లేదని పెద్దలు షరతులు పెడతారు. అగ్ర కులానికి చెందిన మోతుబరి శివాజీని కుల పెద్దలు కుల బహిష్కరణ చేయడానికి కారణం ఏమిటి? ఆయనకు శ్రీలత (బిందు మాధవి)కి మధ్య ఉన్న రిలేషన్‌ ఏమిటి? ఊరిలో తక్కువ కులానికి చెందిన వ్యక్తి రవి(రవికృష్ణ)ని హత్య చేసిందెవరు? ఈ హత్య తరువాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి? ఈ కథకు ఊరి సర్పంచ్ (నవదీప్‌)కు ఉన్న సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: సాధారణంగా ఇలాంటి రూటెడ్‌ కథలు, సొసైటిని ప్రశ్నించే కథలు, కుల వివక్షలు, అసమానతలు ఇలాంటి సమస్యల్ని చూపిస్తూ తమిళ, మలయాళంలో చాలా సినిమాలొచ్చాయి. తమిళ దర్శకులు ఇలాంటి కథలను చాలా లోతుగా విశ్లేషిస్తూ తెరకెక్కిస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ మన దర్శకులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పలాస 1978, లవ్‌స్టోరీ, కోర్టు చిత్రాల్లో కుల వివక్షతో పాటు సమాజంలో ఉన్న అసమానతలను ప్రశ్నిస్తూ సినిమాలు రూపొందించారు.అయితే దర్శకుడు మురళీ కాంత్‌ కూడా తన మొదటి చిత్రంతోనే ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే ఇంతకు ముందు సినిమాల బాటలో కాకుండా దండోరా దర్శకుడు కొత్త కోణంలో ఈ సమస్యను ప్రజెంట్‌ చేశాడు. ఆయన ఇన్నోవేటివ్‌ స్టోరీ టెల్లింగ్‌ ఈచిత్రానికి ప్రధాన బలం.సాధారణంగా కుల వివక్షకు,అసమానతలకు గురైన బాధితుల కోణం నుంచే ఇప్పటి వరకు సినిమాలొచ్చాయి. కానీ ఈ చిత్రంలో అలాంటి చర్యలకు పాల్పడిన కుటుంబాలు కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఆ కుటుంబం సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది? ఆ కుటుంబ సభ్యుల వేదన ఎలా ఉంటుంది? అనే విషయాల్ని దర్శకుడు ఎంతో ఆలోచనాత్మకంగా, అందరి హృదయాలను హత్తుకునేలా ఈ సినిమాలో చెప్పాడు. అంతేకాదు అగ్రకులాల్లో ఉండే అధిపత్యాన్ని ఆ కుటుంబాల్లోని వ్యక్తుల మనోవేదన, కులపెద్దలను ఎదిరించలేదని నిస్సహాయతను చూపించిన విధానం కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా తొలి సన్నివేశం నుంచే దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయంపై క్లారిటీగా ఉన్నాడు అనే భావన కలిగింది. ప్రతి సన్నివేశాన్ని లోతుగా, ఎమోషన్‌తో చూపించడంతో ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. అయితే సెకండాఫ్‌లో కాసింత సాగదీతగా అనిపిస్తుంది. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నట్లుగా కొన్ని సన్నివేశాలు విసగు తెప్పిస్తాయి. అలాంటి సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా తెరకెక్కిస్తే బాగుండేది. ఇలాంటి రూటెడ్‌ కథకు వాణిజ్య అంశాలు జోడించాలంటే స్క్రీన్‌ప్లేలో ఓ మ్యాజిక్‌ ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు కాస్త తడబడినట్లుగా అనిపించింది. శివాజీ పాత్రలో భావోద్వేగాలు బలంగా పండలేదు. అయితే ఒక సన్నివేశంలోని లోపం మరో సన్నివేశంలోని బలం కాపాడింది. ముఖ్యంగా ఈ సినిమాకు పతాక సన్నివేశాలు ప్రాణంగా నిలిచాయి. నటీనటుల పనితీరు: ఈ సినిమాకు దర్శకుడు పాత్రలకు తగ్గ ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతి ఒక్కరూ ఆయా పాత్రను సమర్థవంతంగా పోషించడంతో పాటు, ఈ పాత్రకు ప్రత్యామ్నాయం లేదు అనే విధంగా నటించారు. శివాజీ పాత్ర మంగపతికి పూర్తి భిన్నంగా ఉన్నా అక్కడక్కడా ఆ పాత్ర ఛాయాలు కనిపించాయి. శ్రీలత పాత్రలో బింధు మాధవి, సర్పంచ్‌గా నవదీప్‌ మెప్పించారు. మిగతా పాత్రలు అంతగా ప్రభావం చూపలేదు. మార్క్‌ కె రాబిన్‌ నేపథ్య సంగీతం సన్నివేశంలోని బలాన్నిపెంచింది. ఫోటోగ్రఫీ కథలోని మూడ్‌ని తెలియజేసింది.దర్శకుడు మురళీ కాంత్‌ తను చెప్పాలనుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పాడు. ఫైనల్‌గా: ఈ సమాజానికి చెప్పాలనుకున్న ఓ మంచి విషయాన్ని నిజాయితీగా చేసిన ప్రయత్నమే 'దండోరా'. గ్రామీణ ప్రేమకథలు, రూటెడ్‌ స్టోరీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు 'దండోరా'ను ఎటువంటి సంకోచం లేకుండా చూడొచ్చు. Movie Details Movie Name: Dandora Release Date: 2025-12-25 Cast: Shivaji, Navadeep, Nandu, Ravikrishna, Manika Chikkala, Mounika Reddy, Bindu Madhavi, Radhya, Aditi Bhavaraju Director: Muralikanth Music: Mark K. Robin Banner: Loukya Entertainments Review By: Maduri Madhu Dandora Rating: 2.75 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :