Studio18 News - క్రీడలు / : Doug Bracewell : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డౌగ్ బ్రేస్‌వెల్ (Doug Bracewell) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు సోమవారం అతడు బైబై చెప్పేశాడు. ఆల్‌రౌండర్‌గా న్యూజిలాండ్ విజయాల్లో కీలకమైన అతడు 35 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పక్కటెముకల(Ribs) గాయంతో ఇబ్బంది పడుతున్న ఈ స్టార్ క్రికెటర్ ఈసారి దేశవాళీ సీజన్‌కు దూరమయ్యాడు. వయసు పైబడుతుండడంతో పాటు జూనియర్లు అవకాశాలు అందిపుచ్చుకుంటున్న వేళ రిటైర్మెంట్‌కు సమయం వచ్చేసిందని బ్రేస్‌వెల్ భావించాడు. ‘నా జీవితంలో క్రికెట్ చాలా గర్వించదగ్గది. చిన్నప్పుడు క్రికెటర్‌గా నేను కన్న కలల్ని నిజం చేసుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు న్యూజిలాండ్ బోర్డుకు కృతజ్ఞుడిని. నా దేశం తరఫున ఆడడం, దేశవాళీలో సెంట్రల్ డిస్ట్రిక్స్‌కు ప్రాతినిధ్యం వహించడం మర్చిపోలేను.ఈ సందర్భంగా నాతో కలిసి ఆడిన సహచరులకు, కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం గర్వకారణం. సుదీర్ఘ కాలం క్రికెట్ కెరీర్ సాగినందుకు చాలా సంతోషిస్తున్నా’ అని డౌగ్ బ్రేస్‌వెల్ తెలిపాడు.
ఆస్ట్రేలియాపై 6/40 బ్రేస్‌వెల్ 2008లో ఫస్ట్ క్రాస్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకే సెలెక్టర్ల దృష్టిలో పడి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2011లో ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన మూడో టెస్టులోనే ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన(6/40)తో జట్టును గెలిపించాడీ దిగ్గజం. 2011 నుంచి 2023 మధ్య కాలంలో బ్రేస్‌వెల్ 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
Admin
Studio18 News