Studio18 News - TELANGANA / HYDERABAD : Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. సికింద్రాబాద్ వారాసిగూడలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయా(Sri Kalyana Venkateshwara Swamy)న్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సోమవారం రాత్రి నుంచే వైకుంఠ ఏకాదశి మొదలు కానున్నందున దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో భారీ దేవతామూర్తుల బొమ్మలను ఏర్పాటు చేసి వాటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Admin
Studio18 News