Studio18 News - ఆరోగ్యం / : Respiratory Diseases | చలికాలం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలాన్ని చాలా మంది ఇష్టపడతారు. వాతావరణం బాగున్నప్పటికీ చలికాలంలో చాలా మంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పులు, ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా చాలా మంది బ్యాక్టీరియల్, వైరల్, శ్వాసకోశ ఇన్పెక్షన్ ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉబ్బసం, బ్రాంకైటిస్, అలర్జీ వంటి తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. వీటితో పాటు ముక్కు దిబ్బడ, ముక్కు నుండి నీరు కారడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు శరీర రోగనిరోధక వ్యవస్థను కూడా బలహీనపరుస్తాయి. కనుక చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మూలికలు అవసరం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, శ్వాస వ్యాయామాలు చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులను తగ్గించుకోవడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అలాగే మూలికా నివారణలు, ఆవిరి పీల్చడం, వెచ్చని ద్రవాలను తీసుకోవడం వంటివి చేయడం వల్ల శ్వాస నాళాల్లో శ్లేష్మం పేరుకుపోవడం వంటివి తగ్గుతాయి. ఇన్పెక్షన్ లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని సహజ సిద్దమైన, సులభమైన మార్గాలను అనుసరించడం వల్ల చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ పద్దతుల గురించి వైద్యులు వివరిస్తున్నారు. యూకలిప్టస్ ఆయిల్.. ఆవిరి పట్టడం వల్ల శ్లేష్మం వదులవుతుంది. నాసికా మార్గాలు శుభ్రపడతాయి. యూకలిప్టస్ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇన్పెక్షన్ ను తగ్గించడంలో, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ ఆయిల్ ఎంతో దోహదపడుతుంది. వేడి నీటిలో 2 లేదా 3 చుక్కల యూకలిప్టస్ నూనె వేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని హెర్బల్ టీ లు తాగడం వల్ల గొంతునొప్పి, గొంతు మంట, గొంతులో చికాకు వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాయు మార్గాలు తేలిక పడి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. ఉదయం లేదా సాయంత్రం ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల హెర్బల్ టీ లను తాగడం వల్ల శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బంది తగ్గుతుంది.
పసుపు.. శ్వాస వ్యాయామాలు లేదా ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. శ్వాసకోశ కండరాలు బలంగా తయారవుతాయి. ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాల పాటు అనులోమ- విలోమ లేదా డయాఫ్రాగ్మాటిక్ వంటి వ్యాయామాలు చేయడం మంచిది. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపులో కుర్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ పసుపు కలిపి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఇన్పెక్షన్ లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఊపిరితిత్తుల వాపును, ఇన్పెక్షన్ లను తగ్గించడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. నారింజ, ఉసిరి, జామ, కివి వంటి పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫ్యాన్‌లను శుభ్రం చేయాలి.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల గొంతు చికాకు తగ్గడంతోపాటు ఊపిరితిత్తులకు వ్యాపించే బ్యాక్టీరియా నోటిలో పేరుకుపోకుండా ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. గాలిలో ఉండే దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలర్జీలకు కారణమవుతాయి. కనుక గదిలో ఉండే ఫ్యాన్ లను శుభ్రం చేసుకోవాలి. గదిలో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ లను వాడడం మంచిది. అలాగే తరచూ ఎయిర్ ఫిల్టర్ లను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది సహజమైన యాంటీబయాటిక్ గా పని చేస్తుంది. ప్రతిరోజూ 1 లేదా 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇన్పెక్షన్ లు తగ్గుతాయి. తేనె.. గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాసకోశ మార్గాలకు ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఇన్పెక్షన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల శ్లేష్మం పలుచగా తయారవుతుంది. దీంతో ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం సులభంగా బయటకు పోతుంది. కనుక రోజూ 88 నుండి 10 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇలా ఆయా చిట్కాలు, సూచనలను పాటించడంతో పాటు రోజూ శారీరక వ్యాయామాలు చేయడం, యోగా వంటివి చేయడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే నిద్రించే పరుపులను, ధరించే దుస్తులను కూడా తడి లేకుండా ఎండలో ఆరబెట్టడం వంటివి చేయాలి. ఈ విధంగా చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ , ఈ చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.
Admin
Studio18 News