Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : OTT Movies | కొత్త సినిమాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లోనే కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, సినిమా ప్రియులకు మాత్రం డబుల్ ట్రీట్ అందుబాటులోకి వస్తోంది. కొత్త ఏడాది ఆనందం , సంక్రాంతి పండగ కూడా రానుండటంతో, థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు సినిమాలతో కళకళలాడబోతున్నాయి. సంక్రాంతికి రెడీ అవుతున్న భారీ సినిమాలు ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు ఆసక్తికరమైన చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’, చిరంజీవి – వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘మన శంకర ప్రసాద్ గారు’, నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఓ రాజు’, రవితేజ హీరోగా తెరకెక్కిన ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ చిత్రాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ వారం థియేటర్లలోకి రానున్న సినిమాలు ఏంటనేది చూస్తే.. కొత్త ఏడాది సందర్భంగా ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సైక్ సిద్ధార్థ్, ఫెయిల్యూర్ బాయ్స్, ఇట్స్ ఓకే గురు, ఇక్కిస్, ఘంటశాల, నీలకంఠ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. చిన్న సినిమాలైనా సరే, కంటెంట్ పరంగా ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ వారం రీ రిలీజ్‌ల రూపంలోనూ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ దక్కబోతోంది. వెంకటేష్ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’ , మహేష్ బాబు మురారి సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలను మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో అలరించనున్న సినిమాలు & సిరీస్‌లు థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా ఈ వారం మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఎకో – డిసెంబర్ 31 స్ట్రేంజర్ థింగ్స్ 5 (తెలుగు డబ్బింగ్) – జనవరి 1 లుపిన్ 4 (వెబ్ సిరీస్) – జనవరి 1 హక్ (హిందీ) – జనవరి 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో సీగే మీ వోస్ – జనవరి 2 జియో హాట్‌స్టార్‌లో ది కోపెన్‌హెగెన్ టెస్ట్ – ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది సన్‌నెక్ట్స్‌లో ఇతిరి నేరమ్ – డిసెంబర్ 31 మొత్తానికి, కొత్త ఏడాది ఎంట్రీతో పాటు సంక్రాంతి సందడి ముందే మొదలైపోయింది. థియేటర్లలో కొత్త సినిమాల హడావిడి, ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల వరుస రిలీజ్‌లతో మూవీ లవర్స్‌కు ఇది పండగల సీజన్‌లా మారబోతోంది.
Admin
Studio18 News