Studio18 News - జాతీయం / : బెంగళూరు: క్రిస్మస్ సందర్భంగా మాల్ రద్దీగా ఉన్నది. ఒక మహిళ తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లింది. డెలివరీ మ్యాన్‌గా పని చేసే వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత పారిపోతుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. (Man Harassing Woman) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 25న ఒక మహిళ తన భర్త, పిల్లలతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లింది. క్రిస్మస్ సందర్భంగా జనంతో అది రద్దీగా ఉన్నది. కాగా, మాల్ లోపల ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ వద్ద ఆ మహిళ నిల్చొని ఉన్నది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆ మహిళను అసభ్యకరంగా తాకాడు. భర్తను ఆమె అలెర్ట్ చేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మరోవైపు మాల్ బయట భద్రత కోసం ఉన్న పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. నిందితుడ్ని మనోజ్ చంద్‌గా గుర్తించారు. అస్సాంకు చెందిన అతడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌లో పనిచేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Admin
Studio18 News