Studio18 News - ANDHRA PRADESH / Sri Satyasai : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు, ఫిర్యాదులను ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డికి అందజేశారు. అర్జీలు స్వీకరించిన తర్వాత సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ఆదేశించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, పేదల కోసం చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించాలని ఆమె సూచించారు. గ్రీవెన్స్‌కు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు మీ నమ్మకాన్ని నిలబెట్టేలా సేవలు అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
Admin
Studio18 News