Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్ : మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్(Lady constable) ఆత్మ హత్యాయత్నానికి(Attempted suicide) పాల్పడింది. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ప్రమీలకు తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్‌కు తరలించారు. నాచారం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల కుటుంబ సమస్యలతో సూసైడ్‌కు యత్నించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Studio18 News