Studio18 News - జాతీయం / : ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరి మృతి మృతుడిని బిలాల్‌గా గుర్తించిన పోలీసులు 13కి చేరిన మొత్తం మృతుల సంఖ్య పలువురు క్షతగాత్రులకు ఇంకా కొనసాగుతున్న చికిత్స దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 13కి చేరింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం జరిగిన తీవ్రస్థాయి పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరైన బిలాల్ అనే వ్యక్తి ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. బిలాల్ మృతితో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. మృతదేహానికి ఈరోజే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడులో గాయపడిన మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
Admin
Studio18 News