Studio18 News - జాతీయం / : మహారాష్ట్రలోని అమరావతిలో పెళ్లి వేదికపై వరుడిపై కత్తితో దాడి డీజే డాన్స్‌లో తోశాడన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు బైక్‌పై పారిపోతున్న నిందితులను వెంబడించిన వెడ్డింగ్ డ్రోన్ సుమారు రెండు కిలోమీటర్ల పాటు డ్రోన్‌తో ఛేజ్ చేసిన ఆపరేటర్ డ్రోన్ ఫుటేజ్ కేసులో కీలక ఆధారంగా మారిందన్న పోలీసులు ప్రస్తుతం వరుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి మహారాష్ట్రలోని అమరావతిలో ఒక వివాహ వేడుకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేదికపైనే వరుడిని కత్తితో పొడిచిన దుండగులు, పారిపోతుండగా వారిని వెడ్డింగ్ డ్రోన్‌తో వెంబడించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో డ్రోన్ ఆపరేటర్ చాకచక్యం కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. అమరావతి బడ్నేరా రోడ్డులోని సాహిల్ లాన్‌లో సోమవారం ఉదయం 9:30 గంటలకు సుజల్ రామ్ సముద్ర (22) వివాహం జరుగుతోంది. అందరూ చూస్తుండగానే రఘో జితేంద్ర భక్షీ అనే వ్యక్తి వేదికపైకి వచ్చి వరుడు సుజల్‌పై కత్తితో మూడుసార్లు దాడి చేశాడు. అడ్డుకోబోయిన వరుడి తండ్రిపై కూడా దాడికి యత్నించాడు. అనంతరం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఆ సమయంలో వివాహ వేడుకను చిత్రీకరిస్తున్న డ్రోన్ ఆపరేటర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. పారిపోతున్న నిందితుల వైపు డ్రోన్‌ను తిప్పి వారిని వెంబడించాడు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వారి కదలికలను డ్రోన్ కెమెరాలో బంధించాడు. డ్రోన్ ఆపరేటర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే నిందితులను గుర్తించడానికి బలమైన ఆధారాలు లభించాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ చౌహాన్ తెలిపారు. ఈ దాడికి కారణం చాలా చిన్నదని పోలీసులు వెల్లడించారు. డీజే కార్యక్రమంలో డాన్స్ చేస్తున్నప్పుడు వరుడు సుజల్.. నిందితుడు భక్షీని పక్కకు తోశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న భక్షీ, పెళ్లి రోజున ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Admin
Studio18 News