Studio18 News - జాతీయం / : అంకారా నుంచి 'ఉకాసా' అనే కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్ ఆపరేషన్ 'సెషన్' అనే ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా నిందితులతో సంప్రదింపులు ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్‌కు నేరుగా ఆదేశాలు 2022లో టర్కీకి వెళ్లినప్పుడే నిందితులకు రాడికలైజేషన్ విదేశీ శక్తుల కనుసన్నల్లోనే కుట్ర జరిగిందని అధికారుల నిర్ధారణ ఎర్రకోట పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు, తుర్కియే (టర్కీ) రాజధాని అంకారా నుంచి పనిచేస్తున్న ఓ విదేశీ హ్యాండ్లర్‌కు మధ్య సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం 'ఉకాసా' అనే కోడ్‌నేమ్‌తో ఉన్న ఈ హ్యాండ్లర్... ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, అతని అనుచరులతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇందుకోసం అత్యంత గోప్యత ఉండే 'సెషన్' అనే ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ను వీరు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. 'ఉకాసా' అంటే అరబిక్‌లో 'సాలీడు' అని అర్థం. ఇది హ్యాండ్లర్ అసలు పేరు కాదని, తన గుర్తింపును దాచిపెట్టడానికి పెట్టుకున్న కోడ్ పేరు అని ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఇతను అంకారా నుంచే ఈ గ్రూప్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, రాడికలైజేషన్ ప్రయత్నాలను సమన్వయం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న పలువురు నిందితులు 2022 మార్చిలో భారత్ నుంచి అంకారాకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పర్యటనలోనే వారు తమ హ్యాండ్లర్‌ను కలిసి, ఉగ్రవాద నెట్‌వర్క్‌లోకి చేరి ఉంటారని అనుమానిస్తున్నారు. "నిఘా ఏజెన్సీల కంట పడకుండా ఉండేందుకే నిందితులు, వారి హ్యాండ్లర్ మధ్య సంప్రదింపులు పూర్తిగా 'సెషన్' యాప్ ద్వారానే జరిగాయి. ఈ గ్రూప్ కార్యకలాపాలు విదేశీ మార్గదర్శకత్వంలోనే సాగాయని స్పష్టమవుతోంది" అని ఒక సీనియర్ అధికారి వివరించారు. ఈ నెట్‌వర్క్ కార్యకలాపాల పూర్తి స్వరూపాన్ని, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలతో వీరికి ఉన్న సంబంధాలను నిగ్గు తేల్చేందుకు ఏజెన్సీలు ఇప్పుడు చాట్ హిస్టరీలు, కాల్ లాగ్‌లు, స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
Admin
Studio18 News