Studio18 News - అంతర్జాతీయం / : కాలిఫోర్నియా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం కడియాల భావన, పుల్లఖండు మేఘన దుర్మరణం మృతుల స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా గార్ల మండలం అమెరికాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. మృతులను మహబూబ్ నగర్ జిల్లా గార్ల మండలానికి చెందిన కడియాల భావన (24), పుల్లఖండు మేఘన (24)గా గుర్తించారు. ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం వారు అమెరికాకు వెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్కడి స్థానిక అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగపోయారు. వారి రోదన స్థానికులను కలచివేస్తోంది.
Admin
Studio18 News