Studio18 News - అంతర్జాతీయం / : Burj Khalifa | దుబాయ్ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి దుబాయ్ వీధులు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు క్రియేట్ చేసిన బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Admin
Studio18 News