Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అనిరుధ్, కావ్య మారన్ ప్రేమలో ఉన్నారంటూ మళ్లీ వార్తలు న్యూయార్క్ వీధుల్లో కలిసి కనిపించడంతో ఊహాగానాలకు బలం ఓ అమెరికన్ యూట్యూబర్ వీడియోలో అనుకోకుండా రికార్డ్ వచ్చే ఏడాదే పెళ్లి అంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం కేవలం స్నేహితులు మాత్రమేనంటున్న అనిరుధ్ టీమ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న పుకార్లకు మళ్లీ బలం చేకూరింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ, తాజాగా న్యూయార్క్‌లో కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఓ అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తుండగా అనిరుధ్, కావ్య మారన్ అనుకోకుండా కెమెరా కంట పడ్డారు. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళుతున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సీక్రెట్ లవర్స్ దొరికేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై చర్చ జోరందుకుంది. వచ్చే ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతోందని, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే ఇది జరుగుతుందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు అనిరుధ్ టీమ్ స్పందించింది. వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ వంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనిరుధ్ దక్షిణాదిలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ధనుశ్ 'త్రీ' సినిమాతో కెరీర్ ప్రారంభించి, అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. ఒక్కో సినిమాకు సుమారు రూ. 15 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన చేతిలో విజయ్ ‘జననాయగన్’, లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ వంటి తమిళ చిత్రాలతో పాటు తెలుగులో నాని ‘ది ప్యారడైజ్’, ఎన్టీఆర్ ‘దేవర 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు కావ్య మారన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సహ యజమానురాలిగా, ఛైర్మన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె హావభావాలు సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతుంటాయి. తాజా వీడియోతో మరోసారి వీరి రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారడంతో ఈ పెళ్లి వార్తలపై ఈసారైనా వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తారేమో చూడాలి.
Admin
Studio18 News