Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kamal Haasan| ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటారు కమల్ హాసన్, వెట్రిమారన్. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు కమల్ హాసన్. చివరగా థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. కాగా ఈ క్రేజీ యాక్టర్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కథను నమ్మి సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంటాడీ డైరెక్టర్. ఇప్పుడీ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఇద్దరు సినిమా విషయమై సంప్రదింపులు కొనసాగిస్తున్నారని కోలీవుడ్ సర్కిల్ ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాబోయే మరో మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రానున్న రోజుల్లో ఈ ఘటనపై ఏదైనా ప్రకటన చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ ఇద్దరూ ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తారనేది చూడాలి మరి. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే మూవీ లవర్స్ కు పండుగ అని చెప్పొచ్చు.
Admin
Studio18 News