Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకటరాంరెడ్డి అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 3న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రామంతపూర్‌లో జర్నలిస్టులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అక్రిడిటేషన్ కార్డుల విడుదలలో, ఆరోగ్య పథకాలలో జాప్యం చేస్తోందని వెంకటరాంరెడ్డి విమర్శించారు. మధ్యతరగతి కుటుంబాల వారికి చెందినవారే ఎక్కువగా జర్నలిజంలో ఉన్నారని, అందుకే సమస్యలు మరింత తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. డిసెంబర్ 3న జరగనున్న ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరు కావాలని వెంకటరాంరెడ్డి పిలుపునిచ్చారు.
Admin
Studio18 News