Friday, 14 November 2025 04:29:52 AM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

iPhone 16 Series : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ వచ్చేసిందోచ్.. మొత్తం 4 మోడల్స్, ధర, ఫుల్ ఫీచర్లు వివరాలివే..!

Date : 10 September 2024 11:38 AM Views : 1677

Studio18 News - టెక్నాలజీ / : Apple iPhone 16 Launch Event : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు కొత్త ఐఫోన్లు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఆపిల్ ప్రామాణిక ఐఫోన్ 16 మోడల్‌లు అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు కొత్త వెర్షన్‌ ఐఫోన్ మోడల్స్ కొనుగోలు చేయొచ్చు. గత ఐఫోన్ మోడళ్లతో పోల్చితే.. ఐఫోన్ 16 ప్రో వెర్షన్ కూడా భారీ మార్పులతో వచ్చింది. ఐఫోన్ 16 సిరీస్ త్వరలో ప్రీ-ఆర్డర్‌ ప్రారంభం కానుంది. ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆపిల్ స్టోర్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయానికి రానున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు, సేల్ : ఆపిల్ ఐఫోన్ 16 ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ. 67,000)తో వస్తుంది. అయితే, ఐఫోన్ 16 ప్లస్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 75,500). ఐఫోన్ 16ప్రో ధర 128జీబీకి 999 డాలర్లు (సుమారు రూ. 83,870), ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256జీబీ ధర 1199 డాలర్లు (సుమారు రూ. 1 లక్ష) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలు అమెరికాలో మార్కెట్‌కి సంబంధించినవి. ఐఫోన్ 16 భారత ధర వివరాలను ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫుల్ ఫీచర్లు : డిజైన్, డిస్‌ప్లే : ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లను ఆవిష్కరించింది. “ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం”తో తయారైన కొత్త కలర్-ఇన్ఫ్యూజ్డ్ బ్యాక్‌గ్లాస్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు మొత్తం అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ కలర్స్‌లో వస్తాయి. ఐఫోన్ 16 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 16 ప్లస్ భారీ 6.7-అంగుళాల స్క్రీన్‌ను అందిస్తుంది. రెండు మోడల్‌లు 2000నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తాయి. చీకటిలో 1నిట్ కన్నా తక్కువగా డిమ్ అవుతాయి. ఆపిల్ స్టాండర్డ్ మోడల్‌లకు యాక్షన్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టింది. వాయిస్ మెమోలను రికార్డ్ చేయడం, పాటలను గుర్తించడం లేదా టెక్స్ట్ ట్రాన్సులేట్ చేయడం వంటి ఫీచర్‌లను త్వరగా యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. కస్టమైజడ్ షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫోర్డ్‌పాస్ యాప్ ద్వారా కారుని లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం వంటి యాప్‌లో యాక్టివిటీకి కూడా ఉపయోగపడుతుంది. అదనంగా, ఐఫోన్ 16 కొత్త కెమెరా కంట్రోలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఆన్/ఆఫ్ స్విచ్ కింద కుడి వైపున ఉన్న స్క్రీన్‌పై వేలిని స్లైడ్ చేయడం ద్వారా సెట్టింగ్‌లను అడ్జెస్ట్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. కొత్త కెమెరా కంట్రోల్ బటన్ కూడా ఉంది. సపైర్ గాజుతో ప్రొటెక్షన్ అందిస్తుంది. సింగిల్ క్లిక్ కెమెరాను ఓపెన్ చేస్తుంది. రెండో క్లిక్ ఫొటోను క్యాప్చర్ చేస్తుంది. అలా హోల్డ్ చేయగానే వీడియో రికార్డింగ్ ప్రారంభమవుతుంది. కెమెరా కంట్రోలింగ్ అడ్వాన్స్‌డ్ టచ్ గెచర్‌కు సపోర్టు కూడా ఉంది. ఫుల్ క్లిక్, లైటర్ ప్రెస్ మధ్య తేడా ఉంటుంది. తేలికైన ప్రెస్ క్లీన్ ప్రివ్యూను అందిస్తుంది. షాట్‌ను మరింత కచ్చితంగా రూపొందించవచ్చు. అదనంగా, జూమ్ వంటి ముఖ్యమైన కెమెరా ఫంక్షన్‌లకు జూమ్ ఆప్షన్ అందిస్తుంది. చిప్‌సెట్ : ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ఆపిల్ లేటెస్ట్ ఎ18 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. రెండో జనరేషన్ 3ఎన్ఎమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఎ18 చిప్ 6-కోర్ సీపీయూతో వస్తుంది. ఇందులో 2 పెర్ఫార్మెన్స్ కోర్లు, 4 ఎఫిషియెన్సీ కోర్లు ఉంటాయి. ఆపిల్ ప్రకారం.. ఐఫోన్ 15లోని ఎ16 బయోనిక్‌తో పోలిస్తే.. ఐఫోన్ 16 30 శాతం వరకు స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. చిప్17 శాతం ఎక్కువ సిస్టమ్ మెమరీ బ్యాండ్‌విడ్త్‌ను కూడా అందిస్తుంది. కెమెరా స్పెషిఫికేషన్లు : ఐఫోన్ 16 ఇప్పుడు పవర్‌ఫుల్ 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 48ఎంపీ, 12ఎంపీ ఫొటోలను కలిపి స్పష్టమైన 24ఎంపీ ఇమేజ్‌గా చేస్తుంది. తక్కువ-కాంతిలో కూడా అద్భుతమైన షాట్‌లకు స్పీడ్ ఎఫ్/1.6 ఎపర్చర్‌తో పాటు, సెన్సార్ మధ్య 12ఎంపీ ఉపయోగించి 2x టెలిఫోటో జూమ్ ఆప్షన్ కూడా అందిస్తుంది. మీరు డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌తో 4K60 వీడియోని షూట్ చేయవచ్చు. కొత్త 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా బిగ్ ఎపర్చరు, భారీ పిక్సెల్‌లను కలిగి ఉంది. ప్రకాశవంతమైన ఫొటోలకు 2.6ఎక్స్ ఎక్కువ కాంతిని అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 ఒక ఫోన్‌లో 4 కెమెరా లెన్స్‌లకు సమానమైనది. అందులో రెండు లెన్స్‌లను ఉపయోగించి ప్రత్యేక స్పేషియల్ వీడియో, ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. అన్ని ఐఫోన్ 16 మోడల్స్‌లో ఆపిల్ ఇంటిలిజెన్స్‌ ఫీచర్ : స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్స్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్‌ని చేర్చింది. ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ భాషలను, ఫొటోలను మరిన్నింటిని అర్థం చేసుకోగలదు. వాటిని క్రియేట్ చేయగలదు. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, వెరిఫైడ్, ప్రైవసీ కూడా అందిస్తుంది. డేటా ఎప్పుడూ స్టోర్ కాదు లేదా షేర్ చేయడం కుదరదని ఆపిల్ స్పష్టం చేసింది. ఐఫోన్ 16 సిరీస్‌తో ఆపిల్ ఇమెయిల్‌, నోటిఫికేషన్‌లకు ప్రాధాన్యత ఇస్తుంది. వినియోగదారులు రెడ్ కలర్ దుస్తులలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలలోని మూవెంట్స్ నుంచి ఫొటోలను క్యాప్సర్ చేయొచ్చు. సిరి ఇప్పుడు దశల వారీగా మార్గదర్శకత్వం అందిస్తుంది. యూజర్లు టెక్స్ నేరుగా టైప్ చేయవచ్చు. ఫస్ట్ ఇంగ్లీష్‌లో ఇంటెలిజెన్స్ ఫీచర్లు : కొత్త ఫీచర్ ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్, క్యాలెండర్‌లకు ఈవెంట్‌లలో మెనులు లేదా ఈవెంట్ ఫ్లైయర్‌ల వంటి వస్తువులపై కెమెరాను ఫోకస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. డాగ్ బ్రీడ్స్ సహా మరిన్నింటిని కూడా గుర్తించగలదు, డేటాను ప్రైవేట్‌గా ఉంచుతుంది. రెండు ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు అమెరికాలో ఇంగ్లీషులో మొదట్లో లాంచ్ అవుతాయి. వచ్చే ఏడాది మరిన్ని భాషల్లో అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఫుల్ ఫీచర్లు : డిజైన్, డిస్‌ప్లే : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు కొత్త గోల్డ్ కలర్‌లో వస్తాయి. కెమెరా కంట్రోల్ బటన్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో మోడల్ 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఐఫోన్‌లో ఇప్పటివరకు ఇదే అతిపెద్దది. రెండు మోడల్‌లు సన్నని ఎడ్జ్ కలిగి ఉంటాయి. 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. ప్రో మోడల్‌లు బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, కొత్త డెసర్ట్ టైటానియం కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. చిప్‌సెట్ : ఈ రెండు మోడల్‌లు 2వ జనరేషన్ 3ఎన్ఎమ్ ట్రాన్సిస్టర్‌లపై అడ్వాన్స్‌డ్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తాయి. ఈ కొత్త చిప్‌లో 6-కోర్ జీపీయూ ఉందని, ఎ17 ప్రో కన్నా 20శాతం వేగంగా పనిచేస్తుందని ఆపిల్ పేర్కొంది. 2 పర్ఫార్మెన్స్ కోర్లు, 4 ఎఫిసిషయన్సీకోర్లను కలిగి ఉంది. 20శాతం తక్కువ శక్తితో 15శాతం స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఎ18 ప్రోలో నెక్స్ట్-జెన్ మెషిన్ లెర్నింగ్ యాక్సిలరేటర్లు, స్పీడ్ యూఎస్‌బీ 3 స్పీడ్, ప్రోరెస్ (ProRes) వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. కెమెరా అప్‌గ్రేడ్‌లు : ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసింది. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు సెకండ్-జెన్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కొత్త 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాను కలిగి ఉన్నాయి. 48ఎంపీ (ProRAW, HEIF) ఫోటోలలో 0 షట్టర్ లాగ్‌ యాక్సస్ అందిస్తుంది. కెమెరాలు 4K120 వీడియో క్యాప్చర్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి. ఆటో ఫోకస్‌తో కూడిన కొత్త 48ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఈ రెండు ప్రో మోడల్స్ కూడా 120ఎమ్ఎమ్ ఫోకల్ లెంగ్త్‌తో 5x టెలిఫోటో లెన్స్‌తో కూడిన 12ఎంపీ సెన్సార్‌తో వస్తాయి. ఆడియో అప్‌గ్రేడ్‌లు : ఐఫోన్ 16 ప్రో సిరీస్ వీడియో రికార్డింగ్ సమయంలో స్పేషియల్ ఆడియో క్యాప్చర్ వంటి కొత్త ఆడియో ఫీచర్‌లను తీసుకొచ్చింది. ఆడియో మిక్స్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను స్పీచ్ నుంచి సపరేట్ చేసే మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగిస్తుంది. “ఇన్-ఫ్రేమ్ మిక్స్” కెమెరాలో వ్యక్తి వాయిస్‌ని వేరు చేస్తుంది. రికార్డింగ్ స్టూడియో వంటి సౌండ్ ఎఫెక్ట్ అందిస్తుంది. బ్యాటరీ : ఆపిల్ లార్జ్ కెపాసిటీ, మెరుగైన పవర్ మేనేజ్‌మెంట్‌తో బ్యాటరీని ఆప్టిమైజ్ చేసింది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఐఫోన్‌లో అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. ఈ అప్‌గ్రేడ్ కారణంగా ఎక్కువ సమయం ప్లే టైమ్ అందిస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :