Studio18 News - తాజా వార్తలు / : బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ మజుందార్ షా ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రముఖులు హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో ఆదివారం ఈ వేడుక జరిగింది. కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ వివాహానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, ఎంపీ సుధామూర్తి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో సుధామూర్తి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Admin
Studio18 News